భారతీయులు ఎంతో కాలం నుంచి వాడుతున్న సుగంధ ద్రవ్యాల జాబితాలో యాలకులు కూడా ఒకటి. ఇవి చక్కని సువాసనను ఇస్తాయి. ముఖ్యంగా వీటిని పలు రకాల స్వీట్లలో వేస్తుంటారు. అందువల్ల స్వీట్లకు చక్కని రుచి వస్తుంది. అయితే యాలకులు కేవలం రుచినే కాదు, మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఈ క్రమంలోనే నిత్యం రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు గోరు వెచ్చని పాలలో యాలకుల పొడి కలుపుకుని తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోజూ రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని పాలలో యాలకుల పొడి కలుపుకుని తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు పోతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు.
2. నోటి దుర్వాసనతో బాధపడే వారు పాలలో యాలకుల పొడి కలుపుకుని తాగితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే రాత్రి పూట నోట్లో క్రిములు ఉత్పన్నం కాకుండా ఉంటాయి. దీంతో నోటి సమస్యలు రావు.
3. శ్వాసకోశ సమస్యలు, కఫం ఎక్కువగా ఉన్న వారు రాత్రిపూట పాలలో యాలకుల పొడి కలుపుకుని తాగితే ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
4. గుండె జబ్బులు ఉన్నవారు లేదా సాధారణ ప్రజలు గుండె జబ్బులు రాకుండా ఉండాలన్నా.. నిత్యం రాత్రి పాలలో యాలకుల పొడి కలుపుకుని తాగాలి. దీని వల్ల రక్తం కూడా పెరుగుతుంది. రక్త సరఫరా మెరుగవుతుంది.
5. శృంగార సమస్యలతో బాధపడేవారు పాలలో యాలకుల పొడిని కలుపుకుని తాగితే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఉత్సాహంగా శృంగారంలో పాల్గొంటారు.
6. పాలలో యాలకుల పొడి కలుపుకుని తాగడం వల్ల శరీరంలో ఉన్న విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం శుభ్రంగా మారుతుంది.