పండ్లు తినడం మంచిదా జ్యూస్‌ చేసుకోని తాగడం బెటరా

-

పండ్లకు, పండ్ల రసానికి చాలా తేడా ఉంది. పండ్లు తినడం మంచిదా? లేక జ్యూస్ తాగడం మంచిదా? అన్న గందరగోళం చాలా మందికి ఉంటుంది. కొన్ని పండ్లు తినడానికి బాగుంటాయి, కొన్ని జ్యూస్‌ చేసుకుని తాగితేనే బాగుంటాయి.రెండూ పండ్లతో తయారు చేయబడినప్పటికీ, రెండింటిలోని పోషకాల విషయంలో చాలా తేడా ఉంటుంది. మీరు ఆరోగ్యకరమైన ఎంపిక చేసుకుంటే జ్యూస్ కంటే పండు తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది . అందుకే జ్యూస్‌కు బదులు తాజా పండ్లను తినమని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా, ప్రతిరోజూ ఒక గ్లాసు పండ్ల రసం తాగడం కూడా రోజును ప్రారంభించడానికి ఆరోగ్యకరమైన మార్గం.

 

పండ్ల రసం తాగడం వల్ల ఏం మిస్‌ అవుతామంటే..

ఫ్రూట్ జ్యూస్‌తో ప్రధాన సమస్య ఏమిటంటే, ఇందులో కేలరీలు, యాసిడ్ కంటెంట్ మరియు చక్కెర ఎక్కువ, ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇందులో ముఖ్యమైన పోషకాలు లేవు.

ఫైబర్ లేకపోవడం:

ఫైబర్ మన శరీరానికి చాలా ముఖ్యమైన అంశం. ఇది పేగును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. కానీ మనం పండ్లకు బదులుగా జ్యూస్ తాగినప్పుడు, పండులోని ఫైబర్ మొత్తం ఫిల్టర్ అవుతుంది.

అదనపు కేలరీలు:

పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ దీనిని జ్యూస్ రూపంలో తీసుకుంటే క్యాలరీల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఎందుకంటే ఒక గ్లాసు జ్యూస్ తాగితే అందులో చాలా పండ్ల రసం ఉంటుంది. మీరు ప్యాక్‌డ్ జ్యూస్‌ను తాగుతున్నట్లయితే, అందులో చక్కెరను జోడించడం వల్ల కేలరీలు మరింత పెరుగుతాయి.

సూక్ష్మపోషక లోపం:

పండ్ల రసం అనేక ప్రక్రియల ద్వారా తయారు చేయబడుతుంది. దీని వల్ల ఇందులోని విటమిన్ ఎ, విటమిన్ సి వంటి అనేక సూక్ష్మపోషకాలు పోతాయి.

ఫ్రూట్ జ్యూస్‌తో ప్రధాన సమస్య ఏమిటంటే, ఇందులో కేలరీలు, యాసిడ్ కంటెంట్ మరియు చక్కెరలో ఎక్కువ, ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇందులో ముఖ్యమైన పోషకాలు లేవు. ఫ్రెష్ ఫ్రూట్ లాగా ఫ్రూట్ జ్యూస్ ఆరోగ్యకరమైనది కాదు. కాబట్టి మీరు జ్యూస్‌ల కంటే ఎక్కువగా పండ్లను తినడానికే ప్రాధాన్యం ఇవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news