కలోంజీ వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా…?

-

కలోంజీ సీడ్స్ ఆరోగ్యానికి చాల మంచివి. వీటిని తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అయితే కలోంజీ వలన కలిగే లాభాలు గురించి, ఎటువంటి సమస్యలని తగ్గించుకోవచ్చో తెలుసుకోండి. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే కలోంజీ సీడ్స్ ప్రయోజనాలు చూసేయండి. వివరాల లోకి వెళితే.. ఆరోగ్యానికి, అందానికి కూడా ఈ సీడ్స్ హెల్ప్ చేస్తాయి.

కలోంజీలో డయాబెటిస్ కి చెక్ పెట్టే లక్షణం ఉంది. కనుక డయాబెటిస్ తో బాధపడే వారు అర టీస్పూన్ నూనెను కప్పుడు బ్లాక్ టీలో కలిపి ప్రతీ రోజు ఉదయం తీసుకున్నట్లయితే మంచి బెనిఫిట్ కనపడుతుంది. తల నొప్పి తో తరచూ సతమతం అయ్యేవారు కలోంజీ నూనెని తీసుకుని నుదుటిపై బాగా మసాజ్ చేస్తే రిలీఫ్ లభిస్తుంది. అలానే గోరు వెచ్చని నీళ్ళల్లో, తేనె మరియు నిమ్మరసం తో పాటు కలోంజీ సీడ్స్ పౌడర్ ను కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

అంతే కాదండి బరువు తగ్గాలనుకునే వారు కూడా కలోంజీ తీసుకోవచ్చు. తద్వారా ఎంతో సులువుగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఇది ఇలా ఉండగా అర టీస్పూన్ కలోంజీ నూనెను వార్మ్ వాటర్ తో కలిపి తీసుకుంటే బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది. ఇలా హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారికి మంచి రిజల్ట్ కనపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news