పనసపండును అందరూ ఇష్టంగానే తింటారు. పనసపొట్టుతో బిర్యానీలు చేసుకుని తింటే.. నాన్ వెజ్ తిన్నట్లే ఉంటుంది. అయితే ఆ పనసపొట్టును ఎండపెట్టి పొడి చేసుకుని తీసుకుంటే.. అది షుగర్ పేషెంట్స్ కు నెంబర్ వన్ గా పనిచేస్తుంది అంటున్నారు ప్రకృతి వైద్య నిపుణులు. షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయట. ఇంకెందుకు ఆలస్యం ఈరోజు మనం ఈ పొడిని ఎలా వాడుకోవాలి, దీని పై జరిగిన పరిశోధనలు ఏం చెప్తున్నాయో చూద్దాం.
2021వ సంవత్సరంలో మన శ్రీకాకుళంలోనే.. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ & హాస్పటల్ వారు 42 మంది మీద పరిశోధన చేసారు. వీరికి పనసపొట్టు పౌడర్ ను ఇచ్చారు. షుగర్ వ్యాధి తగ్గించడానికి, లేని వారికి రాకుండా చేయడానికి అద్భుతంగా పనిచేస్తుందని వారు కనుగొన్నారు. ఇప్పుడు మార్కెట్ లో పనసపొట్టు పొడి కూడా విరివిగా లభిస్తుంది. కేవలం సీజన్ లోనే కాకుండా.. ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. ఒబిసిటీ వల్ల వచ్చే టైప్2 డయాబెటీస్ ను చాలా వరకూ ఆపేస్తుందని పరిశోధనలో తేలింది.
పనసపొట్టులో షుగర్ వ్యాధిని తగ్గించడానికి ఏముంది..?
100 గ్రాముల పనసపొడిలో పిండిపదార్థాలు 66 గ్రాములు, ఫైబర్ 18 గ్రాములు ఉన్నాయి….ఈ ఫైబర్ ఆహారాల ద్వారా తయారయ్యే చెక్కర రక్తంలోపలికి చేరకుండా ఫైబర్ ఆపుతుంది. రక్తంలోపలికి వెళ్లిన చెక్కరను నియంత్రించడానికి ఈ పనసపొడిలో ఉన్న కొన్ని మెడిసినల్ ప్రోపర్టీస్ ఉపయోగపడుతున్నాయట. ఈ పొడిలో ఉండే పోషకాలు.. ప్యాంక్రియాస్ గ్రంధిమీద కూడా బాగా పనిచేసి.. ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ అయ్యేలా కూడా చేస్తాయి.
పనసపొట్టు పొడిని షుగర్ పేషెంట్స్ ఎలా వాడుకోవాలి..?
సైంటిస్టులు ఈ పొడిని రెండు మూడు రకాలుగా వాడుకోవచ్చని తెలిపారు. పనసపొడిని పుల్కాలపిండిలో కలిపేసుకుని చేసుకోవచ్చు. ఇది ఎవరికైనా మంచిదే.. ఇంకో పద్దతి..పనసపొడి 50-100 గ్రాములు తీసుకుని వేడి నీళ్లలో కలుపుకుని తాగేయొచ్చు. పనసపొడిని కూరల్లో వేసుకోవచ్చు. పనస పొట్టును ఏ రూపంలో వాడుకున్నా.. షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది. మెడిసిన్ లేకుండా..ఈ పొడిని వాడుకోవచ్చు.. అయితే ఒకేసారి మెడిసిన్ పక్కనపెట్టేసి ఈ పొడిని వాడకూడదు. మెల్లమెల్లగా మెడిసిన్ డోస్ తగ్గిస్తూ.. ఈ పొడిని వాడుకుంటూ.. షుగర్ లెవల్స్ చూసుకుంటూ.. అప్పుడు మెడిసిన్ డోస్ తగ్గిస్తూ.. ఒక స్టేజ్ లో పూర్తిగా మానేయొచ్చు. లావుగా ఉన్నవాళ్లు ఇప్పటినుంచే ఈ పొడిని వాడుకుంటుంటే.. షుగర్ రాదు. ఎందుకంటే.. అధిక బరువు ఒకనాటికి కచ్చితంగా మిమ్మల్ని షుగర్ కు గురిచేస్తుంది. ఈ పొడి మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుందట. కాబట్టి సమస్య ఉన్నవారు ఓ సారి ట్రై చేయండి.
-Triveni Buskarowthu