ఓ పుచ్చకాయ్‌.. నిన్ను తింటే నాకేంటి లాభం!

-

ఎండాకాలం వచ్చిందో లేతో మార్కెట్లో నల్లగా, పచ్చగా పెద్ద పెద్ద బోండాంలా ఉండే పుచ్చకాయలే కనిపిస్తున్నాయి. ఎక్కడికెళ్లినా పుచ్చకాయ్‌ పుచ్చకాయ్‌ అంటూ అరుస్తున్నారు. 50కి రెండు, 40కి ఒకటి అంటూ వ్యాపారులు అరుస్తున్నారు. కొన్నింటినీ సగానికి కోసి మరి రుచి చూపిస్తున్నారు. అది ఎంత వరకు సమంజసం. కొనాలనుకుంటే కొనుగోలు చేసుకుంటారు కదా. అలా నోరూరిస్తారు ఎందుకు. ఆ ఎర్రటి పీసెస్‌ చూసిన తర్వాత చూపు తిప్పుకుంటామా. పర్స్‌లో డబ్బులేకున్నా గూగుల్‌పే చేయోచ్చా అడిగి మరీ కొనుక్కుంటాం. అసలు పుచ్చకాయ్‌ ఎందుకు తినాలి. కష్టపడి సంపాదించిన డబ్బుని అలా వారి చేతిలో పెట్టి దీన్ని భుజాన పెట్టుకొని ఎందుకు రావాలి. అమ్మేవాళ్లు దీని ఉపయోగాలు అసలు చెప్పరు. తినేవాళ్లం మనము కూడా అడగి కనుక్కోం. కనీసం ఇక్కడైనా పుచ్చకాయ్‌ వల్ల ఉపయోగాలేంటో తెలుసకుంటారా..

అబ్బా.. పుచ్చకాయ్‌ వల్ల ఉపయోగం ఏంటో కూడా తెలియదా.. అది తింటే కడుపులో చల్లగా ఉంటుంది. చర్మానికి తేమ అందుతుంది. అంతేకాదు మంచి కలర్‌ కూడా వస్తారు అని అంటారు. అదే మీకు తెలిసింది. మీకు తెలిసింది గోరంత అయితే తెలియాల్సింది కొండంత. మరి ఆ కొండ ఏంటే తెలుసుకోండి మరి.

పోషకాలు

శక్తి : 16కే, కేలరీలు
మాంసకృత్తులు : 2 గ్రా.
కార్బోహైడ్రేట్లు : 3.3 గ్రా.
కొవ్వు : 0.2 గ్రా.
పీచు : 0.6 గ్రా.
సోడియం : 27.3 గ్రా.
పొటాషియం : 160 మి.గ్రా.

ఆరోగ్యం

– డయాబెటిస్‌ ఉన్నవారు నిత్యం పుచ్చకాయ విత్తనాలు తింటుంటే.. షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి. రక్తంలో ఉండే గ్లూకోజ్‌ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
– హైబీపీ ఉన్నవారు పుచ్చకాయ విత్తనాలు తింటే బీపీ తగ్గుతుంది. బీపీ త్వరగా అదుపులోకి వస్తుంది,
– పుచ్చకాయ విత్తనాలను రోజూ తినడం వల్ల కండరాలు దృఢంగా మారి ఏదైనా పని చేసేటప్పుడు అలసట తగ్గుతుంది.
– మెదడు పనితీరు మెరుగ్గా ఉండాలంటే పుచ్చకాయ విత్తనాలను రోజూ తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
– కంటిచూపును మెరుగుపరిచే అద్భుతమైన ఔషధ గుణాలు పుచ్చకాయ విత్తనాల్లో ఉంటాయని, విత్తనాలు నిత్యం తింటుంటే.. నేత్ర సమస్యలు పోతాయని సైంటిస్టులు చెబుతున్నారు.
– పుచ్చకాయ తినడం వల్ల అంగస్తంభన సమస్యలు రావని పరిశోధనలు చెబుతున్నాయి. పుచ్చకాయలోని సిట్రులైన్‌, ఆర్గినైన్‌ పదార్థాల వల్న ఇది సాధ్య పడుతుంది. ఇది నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. శరీరంలోని రక్తనాళాలు రిలాక్స్‌ అవడానికి ఈ చర్య తోడ్పతుంది.

అందం

– వేసవిలో చర్మం ఎంతో పొడిబారిపోయినట్టుగా మారిపోతుంది. మందంగా తయరై చర్మం కాలిపోతున్నట్టుగా ఉంటుంది. వీటికి చెక్‌ పెట్టాలనుకుంటే పుచ్చకాయతో ఫేస్‌మాస్క్‌లు ఎంతగానో ఉపయోగపడుతాయి.
– ఇందులోని 90 శాతం నీరు చర్మాన్ని తేమగా ఉంచేందుకు తోడ్పడుతుంది.
– పుచ్చకాయ రసం, కీర గుజ్జును సమపాళ్లలో కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రమైన నీటితో కడిగేయాలి. ఇక అంతే.. చర్మం నిగారించడమే కాకుండా చర్మాన్ని కాపాడుతుంది.
– పుచ్చకాయ, అరటిపండు మెత్తగా కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత కడిగేయాలి. ఇక అంతే అందమైన చర్మం మీ సొంతం.

Read more RELATED
Recommended to you

Latest news