రూ 1384 కోట్ల తో 61 లక్షల మందికి పెన్షన్.. మాట నిలబెట్టుకున్న జగన్..!

-

పేదవాడికి ప్రతీ సంక్షేమ కార్యక్రమం ఇంటికి వెళ్ళాలి. అప్పుడే ప్రభుత్వం నిజంగా పేదవాడికి సేవ చేసినట్టు. కూటికి గుడ్డకు నా వంతు నేను చెయ్యాలి… ఈ సిద్దాంతాన్ని నమ్ముకుని ముందుకి వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ ఇప్పుడు పెన్షన్ల విషయంలో అందరి మనసులు గెలుచుకుంటున్నారు. గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతీ గడపకు ప్రభుత్వ పథకం అందిస్తా అని చెప్పిన జగన్, ఇచ్చిన మాట ప్రకారం అలాగే ముందుకి వెళ్తున్నారు.

పెన్షన్ రావాలి అంటే గత ప్రభుత్వాల పాలనలో ఎదురు చూడాలి. బ్యాంకుల చుట్టూ పడిగాపులు పడాలి. కాని ఇప్పుడు ఆ బాధ లేదు. వాలంటీర్లు ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రతీ ఇంటికి పెన్షన్ ని తీసుకువేల్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో జోరు జోరుగా పెన్షన్లను అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వాలంటీర్ల ద్వారా ఇప్పుడు పెన్షన్ లను ఇంటి ఇంటికి వెళ్లి అందిస్తున్నారు. ఆదివారం మార్చ్ ఒకటో తేదీ కావడంతో 61 లక్షల మందికి పెన్షన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇందుకోసం 1384 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 11 గంటలకే ఏకంగా 41 లక్షల మందికి పెన్షన్ అందించారు. వాలంటీర్లు ఉదయం నుంచి పెన్షన్లు అందిస్తున్నారు. కృష్ణా జిల్లా బందురులో ఇద్దరు వాలంటీర్లు పెన్షన్ ఉదయం 6 గంటలకు ఇవ్వాల్సిన వాటిని ఇవ్వలేదని మంత్రి పెర్ని నానీ సస్పెండ్ చేసారు. ఏది ఏమైనా సరే జగన్ మాత్రం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రతీ ఒక్కరికి పెన్షన్ అందిస్తూ జయహో జగన్ అనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news