వర్షాకాలం వచ్చిదంటే చాలు ప్రజలపై సీజన్ వ్యాధులు దండయాత్ర చేస్తుంటాయి. అయితే ముఖ్యంగా జలుబు చేస్తే మాత్రం వారం రోజులు పాటు ఇబ్బందులు ఎదుర్కొవాల్సింది. అయితే కరోనా మరోసారి విజృంభిస్తున్న వేళ.. సీజనల్ వ్యాధులబారిన పడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలను చూద్దాం.
* వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల పూటకు ఒకటి చొప్పున వెల్లుల్లి రెబ్బను తింటుంటే
జలుబు త్వరగా తగ్గుతుంది.
* నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు జలుబును త్వరగా తగ్గిస్తాయి.
* పుట్టగొడుగులు మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో జలుబుకు కారణమయ్యే వైరస్‌ల ప్రభావం తగ్గి, జలుబు తగ్గుతుంది.
* పసుపు, అల్లం రసం, గుమ్మడికాయ విత్తనాలు, క్యారెట్లు, చికెన్ సూప్ తీసుకోవడం వల్ల కూడా జలుబును త్వరగా తగ్గించుకోవచ్చు.
* మిరియాలు, బెల్లం, పెరుగు కలిపి తీసుకుంటే ముక్కు దిబ్బద త్వరగా తగ్గి జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
* జాజికాయ పొడి, అల్లం, కుంకుమ పువ్వును పాలల్లో వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుది.
* చింతపండు గుజ్జు, టమాట రసం, మిరియాల పొడి, ఒక ఎండు మిర్చి, కొంచెం ఉప్పు కలిపి సూప్ మాదిరిగా చేసుకుని వేడివేడిగా తాగితే
జలుబు ముక్కు కారడం ఆగుతుంది.