డయాబెటిస్ ని అదుపు చేయడం కష్టమే. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఈ ఆహారానికి దూరంగా ఉండటం మంచిది. ఈ ఆహార పదార్థాలను తినకుండా ఉండడం వల్ల కాస్త ఆరోగ్యంగా ఉండడానికి వీలు అవుతుంది. మరి ఏ ఆహార పదార్థాలు తినకూడదు అనేది ఇప్పుడు చూద్దాం..!
రైస్ :
మనం రోజూ తీసుకునే రైస్ లో విటమిన్స్, మినరల్స్ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇమ్యూనిటీ సిస్టం ని కూడా ఇది పెంపొందిస్తుంది. చర్మ సమస్యలు తగ్గించడానికి మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు సాధారణ రైస్ కంటే బ్రౌన్ రైస్ తినడం మంచిది. దీని వల్ల మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.
కాఫీ:
కాఫీ కొవ్వును తగ్గించడానికి, ఫోకస్ ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. దీనిలో రైబోఫ్లెవిన్, మ్యాంగనీస్ మరియు పొటాషియం వంటి న్యూట్రియంట్స్ ఉంటాయి. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళు కాఫీని తాగక పోవడమే మంచిది. కావాలంటే బ్లాక్ కాఫీ చేసుకుని పంచదార వేసుకోకుండా తీసుకోవడం మంచి పని.
అరటి పళ్ళు:
అరటి పండ్ల లో పొటాషియం, విటమిన్ b6, మెగ్నీషియం, విటమిన్ సి మరియు ఫైబర్ ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఇది మంచిది. ఏది ఏమైనా అరటి పండు లో 16 శాతం షుగర్ కంటెంట్ ఉంటుంది. దీనిని తీసుకోకుండా ఉండటమే మంచిది.
బిస్కెట్స్:
పిండి, పాలు, పంచదార తో బిస్కెట్స్ చేస్తారు. అయితే మీరు పిండి పదార్థాలతో చేసినవి తినకుండా ఉండటం మంచిది. గ్రేయిన్స్ తో చేసిన ఆహారం తీసుకోవచ్చు మీరు.
అలానే పండ్ల రసాలు కూడా తీసుకోకుండా ఉండడం మంచిదే. ఎనర్జీ ప్రోటీన్ బార్లు, తేనే, ఓట్ మెయిల్, డ్రై ఫ్రూప్ట్స్ కి కూడా దూరంగా వుండండి.