24 గంటల్లో 2.10 లక్షల కరోనా కేసులు.. ఎక్కడో తెలుసా..!

-

అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే ప్రపంచంలోనే కరోనా వైరస్ ప్రభావం కలిగిన దేశాలలో మొదటి స్థానంలో కొనసాగుతోంది అగ్రరాజ్యం అమెరికా. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది అయితే మొన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినప్పటికీ మరోసారి రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఏకంగా 2.10 లక్షల కేసులు నమోదు కావడం ప్రస్తుతం అందరినీ బెంబేలెత్తిస్తోంది. కరోనా వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అంతేకాకుండా కరోనా వైరస్ మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 2907 మంది వైరస్ బారినపడి మృత్యువాత పడ్డారు. ఇలా అటు ప్రభుత్వ నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోవడం ఎంతోమంది వైరస్ బారినపడి మరణిస్తూ ఉండడంతో … అగ్రరాజ్య ప్రభుత్వం కాస్త ప్రస్తుతం ఆందోళనలో మునిగిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news