‘ఆచార్య’ లో రష్మిక.. కన్ఫ్యూజన్లో ఫ్యాన్స్..?

-

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందం అభినయంతో దర్శక నిర్మాతలందరూ తనవైపుకు తిప్పుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కాగా ప్రస్తుతం రష్మిక మందన కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో రష్మిక మందన సెలెక్ట్ అయ్యింది అంటూ ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది

అయితే ఇప్పటికే ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి సరసన నటించేందుకు కాజల్ అగర్వాల్ సెలెక్ట్ అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్ సరసన నటించే హీరోయిన్ కోసం రష్మిక మందన్న ను సెలెక్ట్ చేసారట చిత్ర బృందం. అయితే మొదట ఈ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని ని తీసుకోవాలని అనుకున్నప్పటికీ డేట్స్ విషయంలో సమస్య వచ్చే అవకాశం ఉందని భావించిన చిత్రబృందం రష్మిక మందన సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ టాక్ బాగానే ఉన్నప్పటికీ ఇది నిజమా కాదా అని ప్రస్తుతం అభిమానులు కన్ఫ్యూజన్లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news