ఎయిర్‌ పోర్టులో కలకలం : మరోసారి భారీ డ్రగ్స్‌ పట్టివేత..

-

ముంబై : ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయం లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. జాంబియా దేశానికి చెందిన మహిళా ప్రయాణికురాలి నుండి ఏకంగా రూ. 18 కోట్ల విలువ చేసే 3.5 KG హెరాయిన్ ను గుర్తించారు కస్టమ్స్ అధికారులు. ఇథియోపియాలోని అడిస్ అబాబా నుండి ముంబై ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్న జాంబియా కంట్రీకి చెందిన లేడి కిలాడి వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.

కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి డ్రగ్స్ ను ప్లాస్టిక్ కవర్స్ లో చుట్టి దాని పై నుండి కార్బన్ పేపర్ తో రోల్ చేసిన కిలాడి లేడి. ఆ లేడీ మోసుకొని వచ్చిన ట్రాలీ బ్యాగ్ లోపలి భాగంలో డ్రగ్స్ ను దాచి తరలించే ప్రయత్నం చేసింది. కానీ ముంబై ఎయిర్‌పోర్ట్ లో కస్టమ్స్ అధికారులకు అడ్డంగా బుక్ అయింది ఈ కిలాడీ లేడి. ట్రాలీ బ్యాగ్ ను అత్యాధునిక పరికరాలతో స్కానింగ్ చేయగా బయట పడింది ఈ డ్రగ్స్ సరఫరా. దీంతో లేడి కిలాడిని అరెస్ట్ చేసి…. NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు అధికారులు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news