Ram Gopal Varma: ఆ మూవీ ట్రైల‌ర్ దానమ్మా మొగుడులా ఉంది.. ఆర్జీవీ సెన్సెష‌న‌ల్ కామెంట్స్‌!

-

Ram Gopal Varma: వివాదాల కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌(ఆర్జీవీ). ఆయ‌న ఏం చేసిన సంచలనమే.. ఆయన సినిమాల స‌క్సెస్ కంటే.. ఆయ‌న చేసే కామెంట్సే.. రచ్చ ర‌చ్చ చేస్తాయి. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియా పుల్ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. తెగ వైర‌ల‌వుతున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ష‌న్‌లో ‘మహా సముద్రం అనే చిత్రం తెర‌కెక్కుతుంది. అయితే.. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన ట్రెల‌ర్ ఆ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. బలమైన పాత్రలతో ఎమోషనల్ కథని చూపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.

కాగా, ఈ మూవీ ట్రైల‌ర్‌పై సెన్సెష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఆర్జీవీ త‌నదైన శైలిలో కామెంట్ చేశారు. ‘ హేయ్ అజయ్ భూపతి.. మహాసముద్రం ట్రైలర్ ఆర్ఎక్స్ 10,000లా ఉంది.. ఇంకా పచ్చిగా చెప్పాలంటే దాని అమ్మా మొగుడులా ఉంది.. ఆల్ ది బెస్ట్’ అని మహా సముద్రం ట్రైలర్ గురించి వర్మ హాట్ కామెంట్స్ పెట్టారు.

ఇదిలాఉంటే..గురువారం విడుదలైన మహాసముద్రం ట్రైలర్ కు విశేష స్పందన వస్తోంది. ఆర్ఎక్స్ 100 తరహాలో బోల్డ్ రొమాన్స్ ఉన్నప్పటికీ బలమైన కథ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మహాసముద్రం మూవీలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా , వారి స‌ర‌స‌న అదితి రావు, అను ఇమ్మానుయేల్ లు జ‌త క‌ట్టనున్నారు. ప్రధాన పాత్రల్లో రావు రమేష్ , జగపతి బాబు క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

అక్టోబర్ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఇదిలాఉంటే.. త‌న‌ రెండో చిత్రం ‘మహా సముద్రం’తో మరోసారి అలాంటి వండర్‌నే క్రియేట్‌ చేయాలని ఆశతో ఉన్నాడు డైరెక్ట‌ర్‌ అజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news