బిగ్‌బాస్ 4 : అభిజిత్ కోసం ఏడ్చిన హారిక‌

 

బిగ్‌బాస్ సీజ‌న్ 4 వారం దాటినా కొద్దీ ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. టాస్కులు మారుతున్న కొద్దీ ఇంటి స‌భ్యుల్లో మార్పుల స్ప‌ష్టంగా క‌నిపించ‌డం మొద‌లైంది. ఎవ‌రు ఎవ‌రిని సేవ్ చేస్తున్నారు. ఎవ‌రు ఎవ‌రి కోసం సాక్ర‌కిఫై కి సిద్ధ‌మ‌వుతార‌న్న‌ది ఈ వారం క్లియ‌ర్‌గా తెలిసిపోయింది. ఒక‌రి ఇరుకున పెట్టి మ‌నం మాత్ర‌మే సేవ్ కావాల‌ని ఎవ‌రు గేమ్ ఆడుతున్నారో కూడా క్లారిటీ వ‌చ్చేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ హౌస్ నుంచి సూర్య కిర‌ణ్ టు కుమార్ సాయి వ‌ర‌కు ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. సోమ‌వారం కావ‌డంతో నామినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లైంది. ఇంటిలోని స‌భ్యుల్ని ఇద్ద‌రిద్ద‌రుగా సెల్ఫ్ నామినేట్ కావాల‌ని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. మోనాల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు.. నేను మాత్ర‌మే స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని కాబ‌ట్టి నేను సేవ్ అవుతాన‌ని అఖిల్ అన‌డంతో మోనాల్ త‌ను నామినేట్ అయింది. ఆ త‌రువాత అవినాష్ – సోహైల్ ల మ‌ధ్య నామినేష‌న్ కి సంబంధించిన చ‌ర్చ న‌డిచింది. చివ‌రికి అవినాష్ నామినేట్ అయ్యాడు.

ఈ సంద‌ర్భంగా అభిజిత్ – హారిక‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగింది. ఒక ద‌శ‌లో హారిక అభిజిత్‌ని ష‌ట‌ప్ అంటూ అరిచి త‌న‌ని నామినేట్ చేయ‌డం ఇష్టం లేద‌ని, బిగ్‌బాస్ ఇన్ అన్‌ఫేర్ అని ఏడ్చేసింది. హారిక కోసం ఫైన‌ల్‌గా అభిజిత్ సాక్రిఫై చేసి నామినేట్ కావ‌డం ఆక‌ట్టుకుంది. అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ అరియానా – మెహ‌బూబ్‌ల మ‌ధ్య జ‌రిగింది. త‌నకు నామినేట్ కావ‌డం ఇష్టం లేద‌ని అరియానా .. త‌న‌కూ ఇష్టం లేద‌ని మెహ‌బూబ్ పోటా పోటీగా వాదించుకున్నారు. ఫైన‌ల్‌గా అరియానా నామినేట్ చేసుకుంది. ఆట‌లో త‌ను నామినేట్ అయినా రియ‌ల్‌గా గెలిచింది. ఈ విష‌యంలో అ‌రియానా ముందు మెహ‌బూబ్ గెలిచినా ఓడిపోయాడు. లాస్య – దివిల మ‌ధ్య పెద్ద‌గా వాద‌న లేకుండానే దివి తాను నామినేట్ అవుతాన‌ని ప్ర‌క‌టించింది. ఇలా సోమ‌వారం ఎపిసోడ్ మొత్తం నామినేష‌న్ ప్ర‌క్రియ‌పైనే సాగింది.