యాప్స్ నుండి లోన్ తీసుకునే వాళ్లకి షాక్..!

బ్యాంక్ కి వెళ్లి లోన్ తీసుకోవడం అనేది నిజంగా చాలా కష్టం. లోన్ తీసుకోవాలనుకుంటే బ్యాంక్ లో డాక్యుమెంట్స్ ని ఇవ్వాలి. అలానే ఈ లోన్ రావడానికి వారం రోజుల వరకు సమయం కూడా పడుతుంది. పైగా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది కూడా. అయితే ఇవన్నీ లేకుండా ఈజీగా లోన్ పొందడం కోసం.. వేగంగా లోన్ పొందడం కోసం కొంత మంది భావిస్తుంటారు.

Loan Features - Different Types & Examples | CFI

అందుకని ఈ మధ్య కాలంలో యాప్స్ నుండి లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. దీనితో ఆయా యాప్స్ ద్వారా ఇన్‌స్టంట్ లోన్స్ పొందుతున్నారు. ఏది ఏమైనా యాప్స్ ద్వారా ఇన్‌స్టంట్ లోన్ పొందే వారు జాగ్రత్తగా ఉండాలి. దీనికి గల కారణం ఏమిటంటే యాప్ స్టోర్స్‌లో చాలా వరకు చట్టవిరుద్ధమైన లోన్ యాప్స్ వున్నాయి.

కాబట్టి జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. 600 ఇల్లీగల్ లోన్ యాప్స్ ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యానెల్ అంది. ఇండియన్ ఆండ్రాయిడ్ యూజర్లకు 80కి పైగా అప్లికేషన్ స్టోర్స్‌లో 1100 లెండింగ్ యాప్స్ ఉన్నాయని చెప్పింది.

క్విక్ లోన్, ఇన్‌స్టంట్ లోన్, లోన్ వంటి కీవర్డ్స్‌లో వెతికితే ఈ యాప్స్ మనకు కనపడతాయి. ఈ మధ్య కాలం లో ఆన్లైన్ ద్వారా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆర్‌బీఐ లోన్ యాప్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి మోసాలు చాలా వరకు బయట పడడం జరిగింది.