ఇప్పటికే భారీ వర్షాలతో, వరదలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావారణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనిస్తోంది. తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా పయనించే అవకాశం ఉందని అంటున్నారు. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అలానే తెలంగాణలో కూడా పలు చోట్ల వర్షాలు.
అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. రాబోయే 48 గంటలు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల కొన్నిసార్లు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది. ప్రజలంతా బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని కూడా చెబుతున్నారు. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యింది.