అలర్ట్‌ : మరో మూడు రోజులు భారీ వర్షాలు

ఏపీకి మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రుతుపవన ద్రోణి పోరుబందర్, సూరత్, జల్గావ్, రామగుండం, మచిలీపట్నంల మీదుగా మరియు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది. ఒక ఉపరితల ద్రోణి దక్షిణ గుజరాత్ నుండి దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 km నుండి 5.8 km ఎత్తుల మధ్య ఏర్పడింది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.


ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:ఈరోజు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు కర్నూలు, కడప జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.