నగరంలో భారీ వర్షాలు.. అవసరమైతే తప్ప బయటికి రావద్దు: జిహెచ్ఎంసి

-

హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మణికొండ, షేక్పేట, గచ్చిబౌలి, ఖైరతాబాద్, దిల్సుఖ్నగర్, లక్షీకపూల్, పంజాగుట్ట తదితర ఏరియాల్లో వర్షం పడుతోంది. సుమారు గంట నుంచి ఏకధాటిగా కుండపోత వర్షం పడుతుండడంతో రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి.దీంతో నగరంలోని రోడ్లు నీటితో నిండిపోయాయి.ఫలితంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ క్రమంలో ప్రజల కోసం జిహెచ్ఎంసి టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. GHMC-DRF సహాయం కోసం 040-21111111 5 90001136675 ఫోన్ చేయాలని పేర్కొంది. వర్షం వేళ అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news