జిహెచ్ఎంసి పరిధిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. నగరంలోని అసిఫ్ నగర్ లో 7.1 సెంటిమిటర్లు, ఖైరతాబాద్ లో 5.5 సెంటిమిటర్లు, జూబ్లీహిల్స్ లో 4.9 సెంటిమిటర్లు, మెహదీపట్నం లో 3.4 సెంటిమీటర్లు, కార్వాన్ లో 3.3 సెంటిమిటర్లు, బేగంపెట్ లో 1.7 సెంటిమీటర్లు, ,గోశామహల్ లో 1.3 సెంటిమిటర్లు, సికింద్రాబాద్ లో 1.1 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదయ్యాయి, అలానే గచ్చిబౌలి, శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, నార్సింగ్ ప్రాంతాలలోఈదురుగాలులతో భారీ వర్షం కురిస్తోంది.
భారీ వర్షంతో చాదర్ ఘాట్, మలక్ పేట నుంచి దిల్ సుఖ్ నగర్ వెళ్ళే రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక రోడ్లన్నీ జలమయం కావడంతో జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యాయి. హైదరాబాద్ పాతబస్తీలో భారీ వర్షం కురవడంతో రోడ్ల పై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తూ, పలు చోట్ల నీరు పోవడానికి దారి లేక రోడ్ మీద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గంట కు 2సెంమీల వర్షపాతం మాత్రమే తట్టుకునే హైద్రాబాద్ డ్రైనేజీ వ్యవస్థ ఈరోజు ఏక దాటిగా 15 సెంమీల వర్షం పడడంతో అస్తవ్యస్తం అయింది. ఈ దెబ్బకు GHMC చేతులు ఎత్తేసింది. ఈ క్రమంలో హైద్రాబాద్ నీట మునిగగా, రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైద్రాబాద్ రోడ్ల పై ఈరోజు రాత్రి ఇళ్ళకు చేరుకునేందుకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు.