Breaking : తమిళనాడులో వర్ష బీభత్సం.. 26 చేరిన మృతుల సంఖ్య

-

తమిళనాడులో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రవేశం అనంతరం తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. వానల కారణంగా మరో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 26కి చేరింది. చెన్నైలో శనివారం ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. తిరువళ్లూరు జిల్లాలో మరొకరు మరణించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు అధికారులు. మృతుల కుటుంబాలకు సీఎం స్టాలి సంతాపం ప్రకటించారు. ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్‌ 29న ప్రవేశించాయి. గత 24 గంటల్లో తమిళనాడులో పది సెంటీమీటర్లకుపైగా వర్షాపాతం రికార్డయ్యింది.

Tamil Nadu rains: 26 dead, CM announces monetary relief | Mint

నాగపట్నం జిల్లాలోని కొడియాకరై స్టేషన్‌లో అత్యధికంగా 9 సెంటీమీటర్లు, రామేశ్వరం (రామనాథపురం)లో ఎనిమిది, కొట్టారం (కన్యాకుమారి), కులశేఖరపట్టణం (తూత్తుకుడి)లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. శుక్రవారం కురిసిన వర్షాలకు 140 గుడిసెలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం తెలిపింది. 4న చెన్నైలో నేలకూలిన 64 చెట్లను తొలగించారు. వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీఎం స్టాలిన్‌ ఆదేశించారు. మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పీకే శేఖర్‌బాబు స్వయంగా మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.

Read more RELATED
Recommended to you

Latest news