వారి నుంచే బైడెన్‌కు ముప్పా..?

-

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ పదవి ప్రమాణ స్వీకారం దగ్గర పడుతున్న రోజుల కొద్ది ఉత్కంఠ నెలకొంటుంది. ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజధాని వాషింగ్టన్‌ ఉద్రిక్తత నెలకునే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బైడెన్‌ ప్రమాణ స్వీకారంలో ఆయనకు భద్రత ఇచ్చే సిబ్బందే దాడుటకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో రక్షణ యంత్రాంగం అప్రమత్తమైంది. రక్షణ కల్పించాల్సిన సిబ్బందే దాడులకు పూనుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలు రావడం ఆందోళన కల్గిస్తుందని రక్షణశాఖ పేర్కొంది. ట్రంప్‌కు సంబంధించిన వ్యక్తులు సైతం హింసకు పాల్పడుతారని వస్తున్న ప్రచారంతో అడుగడుగునా తనిఖీలు ముమ్మరం చేశారు.

కనివిని ఎరగని భద్రత..

ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడికి లేని భద్రత సిబ్బందిని కేటాయించారు. ఇటీవల జరిగిన క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు జరిపిన దాడుల్లో పోలీసులు సైతం ఉండటంతో ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని తగు జాగ్రత్తలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.భద్రత నిమిత్తం దాదాపుగా 25 వేల నేషనల్‌ గార్డులను నగరంలో దించేశారు. వేలల్లో పోలీసులు మోహరించారు. భావజాలతో ఎవరైనా ఎప్పుడైనా దాడులు జరపవచ్చని మొత్తం సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని రక్షణ శాఖ కార్యదర్శి ఆదేశిస్తున్నారు. కేవలం వాషింగ్టన్‌లోనే కాకుండా 50 రాష్ట్రాల రాజధానుల్లో కూడా కట్టుదిట్టమైన భద్రత బలగాలను మోహరించారు.

ఆన్‌లైన్‌లో మాట్లాడే వివరాలపై..

ఈ సందర్భంగా వాషింగ్టన్‌ మేయర్‌ మరియల్‌ బౌజర్‌ మాట్లాడారు.‘దేశ భక్తులని చెప్పుకునే వారు తమ సొంత ప్రభుత్వాన్ని కూలదోస్తారని.. పోలీస్‌ అధికారులను చంపేస్తారని ఎప్పుడూ అనుకోలేదు. కానీ.. అదే జరిగింది. దీని దృష్ట్యా ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా మా పోలీసు శాఖ, ఫెడరల్‌ పోలీస్‌ బృందాలతో సమన్వయంగా వ్యవహరిస్తున్నారు’అని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ఎక్కువసేపు సంభాషిస్తున్నవారి సమాచారాన్ని సైతం సేకరిస్తున్నట్లు ఎఫ్‌బీఐ డెరెక్టర్‌ క్రిస్టోఫర్‌ వేరి పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ట్రంప్‌ మద్దతుదారులు, అభిమానులు పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, చట్టసభల భవనాలను ముట్టడిస్తూనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news