కేసీఆర్ పొత్తుల ఎత్తులు..కమలం కూడా?

-

రాజకీయాల్లో పొత్తులు అనేవి ఒకోసారి కలిసొస్తాయి..ఒకోసారి అంతగా కలిసిరావు. అలా అని పొత్తులు అనేది రాజకీయాల్లో కీలకం కాకుండా ఉండవు. అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి పొత్తులు ఉండాలి. అప్పుడే రాజకీయంగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ సక్సెస్ కొట్టడానికి కే‌సి‌ఆర్ మళ్ళీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు సింగిల్‌గా గెలిచి సత్తా చాటారు. అలాగే కాంగ్రెస్, టీడీపీలని అణగదొక్కి టి‌ఆర్‌ఎస్ పార్టీని ఇంకా బలోపేతం చేశారు.

ఇదే క్రమంలో బి‌జే‌పి బలపడింది. టి‌ఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బి‌జే‌పి ఎదుగుతుంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలుపు తర్వాత బీజేపీతో రిస్క్ తప్పదని కే‌సి‌ఆర్‌కు అర్ధమైంది.అందుకే బి‌జే‌పికి చెక్ పెట్టడానికి రాజకీయం చేస్తున్నారు. కేంద్రం స్థాయిలో బి‌జే‌పిని టార్గెట్ చేశారు. అలాగే రాష్ట్రంలో బి‌జే‌పికి ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పి..పొత్తులకు కే‌సి‌ఆర్ సిద్ధమవుతున్నారు. మునుగోడులో కమ్యూనిస్టుల మద్ధతు తీసుకున్న విషయం తెలిసిందే.

మునుగోడులో సి‌పి‌ఐకి దాదాపు 15 వేల ఓట్ల బలం ఉంది..అటు సి‌పి‌ఎంకు 5 వేల ఓట్లు వరకు ఉంటాయి. ఆ రెండు పార్టీలు సపోర్ట్ ఇవ్వడం వల్ల..10 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి టి‌ఆర్‌ఎస్ బయటపడింది. ఇలా కమ్యూనిస్టులు కలిసి రావడంతో..నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారితో కలిసి పోటీ చేయడానికి కే‌సి‌ఆర్ రెడీ అయ్యారు. కమ్యూనిస్టులతో పొత్తు ఉంటే ఖమ్మం, నల్గొండ, వరంగల్ లాంటి జిల్లాల్లో కాస్త టి‌ఆర్‌ఎస్‌కు ప్లస్.

కమ్యూనిస్టులే కాదు..ఎం‌ఐ‌ఎంతో కూడా టి‌ఆర్‌ఎస్ కలుస్తుందని తెలుస్తోంది. ఇప్పటివరకు పరోక్షంగా ఎం‌ఐ‌ఎం..టి‌ఆర్‌ఎస్‌కు మద్ధతు ఇచ్చింది. నెక్స్ట్ డైరక్ట్ కలుస్తారని తెలుస్తోంది. ఇలా బి‌జే‌పిని నిలువరించడానికి కే‌సి‌ఆర్ పొత్తుల ఎత్తులతో ముందుకొస్తున్నారు. అయితే బి‌జే‌పి బలం పెరగాలంటే ఆ పార్టీ కూడా పొత్తుల వైపు వెళ్ళాలి. తెలంగాణలో టి‌డి‌పి కనిపించడం లేదు..ఆ పార్టీకి కొంత క్యాడర్ బలం ఉంది. అటు పవన్ సపోర్ట్ ఉంటే..కాస్త బెనిఫిట్ అవుతుంది. మరి వారితో బి‌జే‌పి కలుస్తుందా లేదా? అనేది తెలియడం లేదు. కానీ కే‌సి‌ఆర్ మాత్రం పొత్తులతోనే ముందుకొస్తారు

Read more RELATED
Recommended to you

Latest news