హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ప్రముఖులు వీరే…

-

దేశంలో తొలి సీడీఎస్, త్రివిధ ధళాల సమన్వయకర్తగా వ్యవహరించే బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం యావత్ దేశాన్ని కలచివేసింది. ఆయనతో పాటు మరో 12 మంది మొత్తంగా 13 మంది దుర్మరణం చెందారు. అయితే ఇలాగే ఇప్పటి వరకు హెలికాప్టర్ ప్రమాదంతో పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. గతంలో జరిగిన విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో తెలుగు ప్రముఖులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జీఎంసీ బాలయోగి, సినీనటి సౌందర్య ప్రాణాలను వదిలారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి

ఉమ్మడి ఏపీకి రెండో సారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టన కొద్ది నెలలకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. వాతావరణ కారణాలు, దట్టమైన క్యుమ్యులోనింబస్ మేఘాల్లో హెలికాప్టర్ చిక్కుకుపోవడం అప్పట్లో ప్రమాదానికి కారణామయ్యాయి. 2009 సెప్టెంబర్‌ 2న చిత్తూరు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళుతుండగా.. ఆయన ప్రయాణిస్తున్న బెల్‌ 430 హెలికాప్టర్‌ నల్లమల అడవుల్లో కుప్పకూలిపోయింది. ఆయన సహా మొత్తం ఐదుగురు ఆ ప్రమాదంలో మరణించారు.

జీఎంసీ బాలయోగి.

ఎన్డీయే ప్రభుత్వ సమయంలో లోక్ సభకు స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన తెలుగు వాడు జీఎంసీ బాలయోగి కూడా హెలికాప్టర్ క్రాష్ లోనే మరణించారు. 2002 మార్చి 3న ఆయన ప్రయాణిస్తున్న బెల్‌ 206 హెలికాప్టర్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో కుప్పకూలిపోయింది.

ధోర్జీ ఖండూ.

అరుణాచల్ ప్రదేశ్ సీఎం కూడా వైెెఎస్సార్ లాగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కుప్పకూలిపోయింది. 2011 ఎప్రిల్ 30న  ఈ  ప్రమాదం చోటు చేసుకుంది.

మాధవరావు సింథియా

కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుత బీజేపీ నేత, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తండ్రి మాదవ రావు సింధియా కూడా విమాన ప్రమాదంలోనే మరణించారు. 2001 సెప్టెంబర్‌ 30న కాన్పూర్‌లో జరిగిన ఈ ఘటనలో సింధియా సహా ఏడుగురు మరణించారు.

సంజయ్ గాంధీ..

కాంగ్రెస్ నేత, ఇంధిరా గాందీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ కూడా విమాన ప్రమాదంలోనే మరణించాడు. 1980 జూన్‌ 23న దిల్లీలో సఫ్దర్‌జంగ్‌ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్‌ గాంధీ మరణించారు.

సౌందర్య

ప్రముఖ సినీనటి సౌందర్య కూడా హెలికాప్టర్ క్రాష్ లోనే ప్రాణాలు వదిలారు. 2004 ఏప్రిల్‌ 17న బెంగళూరులో ఈ ప్రమాదం జరిగింది. ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్ణాటక నుంచి హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో ఆమె ప్రాణాలు వదిలారు.

ఓపీ జిందాల్‌

హరియాణాకు చెందిన మంత్రి ఓపీ జిందాల్‌ 2005 మార్చి 31న మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని షెహరాన్‌పూర్‌ వద్ద కుప్పకూలిపోయింది.

వీరితో పాటు కాంగ్రెస్‌ నేత ఎస్‌ మోహన్‌కుమార్‌ మంగళం, పంజాబ్‌ గవర్నర్‌ సురేంద్ర నాథ్‌, కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి ఎన్‌వీఎన్‌ సోము, అరుణాచల్‌ ప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి డేడా నటుంగ్‌ తదితరులు ఈ తరహా ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయారు

 

Read more RELATED
Recommended to you

Latest news