BREAKING : నల్గొండ జిల్లాలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు మృతి

-

నల్గొండ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని పెదవుర మండలంలోని తుంగతుర్తి గ్రామా పంచాయతీ పరిధిలో ఓ హెలికాఫ్టర్‌ కూప్ప కూలింది. అయితే.. ఈ ప్రమాదంలో ఏకంగా ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.

ఫైలెట్‌ తో పాటు మరో వ్యక్తి ఈ ఘోర ప్రమాదం లో మరణించినట్లు సమాచారం అందుతోంది.
ప్రమాదం జరిగిన వెంటనే ద‌ట్ట‌మైన పొగ‌లు రావ‌డంలో ఇద్ద‌రు వ్య‌క్తులు ముక్కలు మ‌క్క‌లుగా మారినట్లు తెలుస్తోంది.

అసలు ఈ హెలికాప్టర్‌ ఎక్క‌డి నుంచి వ‌చ్చిందనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. ద‌ట్ట‌మైన పొగ‌లు, పెద్ద శ‌ద్దం ఒక్క‌సారిగా రావడంతో… స్థానిక ప్ర‌జ‌లందరూ భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇక ఈ సంఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వివ‌రాల‌ను సేక‌రిస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news