ఆర్మీ హెలికాప్టర్ క్రాష్… ఫోరెన్సిక్ ల్యాబ్ కు ప్రత్యక్ష సాక్షి మొబైల్ ఫోన్..

-

తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్ అటవీ ప్రాంతంలో ఆర్మీహెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో దేశ తొలి సీడీఎస్ బిపిన్ రావత్ తో సహా మరో 13 మంది చనిపోవడం తెలిసింది. అయితే హెలికాప్టర్ చివరి క్షణాలను ఒకరు మొబైల్ ఫోన్ లో చిత్రీకరించడం కీలకంగా మారింది. కోయంబత్తూర్‌ నగరానికి చెందిన జో అనే వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ డిసెంబర్ 8వతేదీన తన స్నేహితుడు నాజర్, అతని కుటుంబ సభ్యులతో కలిసి కొండ ప్రాంతాలైన నీలగిరి జిల్లాలోని కట్టేరి ప్రాంత పర్యటనకు వచ్చారు.హెలికాప్టర్ కూలిపోతుండగా ఫొటోగ్రాఫర్ జో వీడియో తీశారు. కాగా అతను వీడియో తీస్తున్న సమయంలో హెలికాప్టర్ చాలా కిందనుంచి ప్రయాణించడం.. ఆ తరువాత దట్టమైన పొగమంచులోకి వెళ్లడం.. కొన్ని క్షణాల్లోనే చెట్లను ఢీకొట్టి, కూలిపోయినట్లు పెద్ద శబ్ధం రావడం వీడియోలో షూట్ చేశాడు. వీడియో తీస్తున్న క్రమంలో పెద్ద శబ్ధం రావడంతో అక్కడ ఉన్న వారు ఏం జరిగిందంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చూశాం.

ప్రస్తుతం వీడియో తీసిన ఈ ఫోన్ ను ఫోరెన్సిక్ విశ్లేషణ గురించి పంపించారు. అసలు ప్రమాదం సమయంలో హెలికాప్టర్ ఎటువంటి పరిస్థితుల్లో ఉందో తెలుసుకునేందుకు ఈ వీడియో ఉపయోగపడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో దర్యాప్తులో భాగంగా నీలగిరి పోలీసులు ఈ వీడియోను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news