సామీ.. సామీ అంటూ స్టేజ్ పైనే స్టెప్పులు వేసిన రష్మిక

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తాజాగా నటించిన సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది.

ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక మందన స్టేజ్ పైనే స్టెప్పులేసింది. పుష్ప సినిమాలో బాగా పాపులర్ అయిన సామీ.. సామీ అనే పాటకు… స్టెప్పులేసింది రష్మిక. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే.. ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ సుకుమార్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది హీరోయిన్ రష్మిక. కాగా పుష్ప సినిమా డిసెంబర్ 17 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ థియేటర్లలో మాత్రమే చూడాలని రస్మిక కోరింది.