వివాదంలో పుష్ప ఐటెమ్ సాంగ్.. సమంతపై కేసు నమోదు… !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా… డిసెంబర్ 17న విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో.. సమంత నటించిన ఐటమ్ సాంగ్ చుట్టూ వివాదం నెలకొంది.

ఈ ఐటమ్ సాంగ్ ను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ … ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ సంస్థ కేసు వేసినట్లు సమాచారం అందుతోంది.  ఈ ఐటమ్ సాంగ్ తీసిన చిత్ర బృందం పై అలాగే..ఈ సాంగ్ లో నటించినందుకు సమంతపై కేసు నమోదు చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ పాటలోని లిరిక్స్… పురుష సమాజానికి కించపరిచేలా ఉన్నాయని… వెంటనే ఆ పాటను తీసేయాలి అంటూ డిమాండ్ చేశారు. పురుషులను కించపరుస్తూ.. లిరిక్స్ రాయడం ఏంటని… వెంటనే దీనిపై క్షమాపణలు చెప్పాలని కూడా పిటిషన్లో పేర్కొంది ఆ సంస్థ. అయితే కేసుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.