ఆమె గుండెకు ఎప్పుడూ ఛార్జింగ్‌ పెట్టాల్సిందే.. బ్యాటరీ డౌన్‌ అయితే ప్రాణానికే ప్రమాదం

-

ప్రపంచంలో కనీ వినీ ఎరుగని వ్యాధులు ఉన్నాయి. చాలా మంది వారికి ఉన్న అనారోగ్య సమస్యలే పెద్దవిగా భావిస్తుంటారు. అసలు కొందరికి ఉన్న వ్యాధుల గురించి తెలిస్తే.. షాక్‌ అవుతారు. వాళ్లతో పోల్చుకుంటే మనకు ఉన్న సమస్యలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఒక మహిళకు స్లీపింగ్‌ డిస్‌ఆర్డర్‌ వల్ల రోజులో 20 గంటల పాటు నిద్రపోతూనే ఉంటుంది. దాని వల్ల ఆమె కెరీర్‌ నాశనం అయింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం ఫోన్‌కు డైలీ ఛార్జింగ్‌ పెట్టాలి. లేదంటే అది స్విచ్‌ ఆఫ్‌ అవుతుంది. ఆ మహిళ గుండెకు కూడా డైలీ ఛార్జింగ్‌ పెట్టాలట. గుండెకు ఛార్జింగ్‌ లేకపోతే.. ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది.

మానవ శరీరం మొత్తం హృదయ స్పందనపై ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి గుండె కొట్టుకోవడం ఆగిపోతే అదే ఆ వ్యక్తికి చివరి క్షణం అవుతుంది. అయితే ఒక వ్యక్తి గుండె బ్యాటరీ ద్వారా నడుస్తుందంటే నమ్ముతారా? తప్పక నమ్మాలి. ఎందుకంటే ఒక అమెరికన్ మహిళ గుండె బ్యాటరీలతో నడుస్తోంది. బ్యాటరీ శక్తితో ఆమె గుండె కొట్టుకుంటుంది. అమెరికాలో నివసించే సోఫియా బ్యాటరీలపై ఆధారపడి జీవిస్తోంది. బ్యాటరీ శక్తితో ఆమె పల్స్ కొట్టుకుపోయింది.

సోఫీ లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ (LVAD) కోసం శస్త్ర చికిత్స చేయించుకుంది. కాబట్టి ఆమె గుండె యంత్రం ద్వారా కొట్టుకుంటుంది. సోఫియా రివర్సిబుల్ డైలేటెడ్ కార్డియోమయోపతి అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఇది ఒక రకమైన కండరాల వ్యాధి, ఆమె గుండె కొట్టుకోలేకపోతుంది. ఇందుకోసం ఆమెకు హార్ట్ బీట్ పరికరాన్ని అమర్చారు. ఆమె గుండె LVAD పరికరంతో కొట్టుకుంటుంది. ఈ అరుదైన వ్యాధికి సంబంధించిన సమాచారాన్ని సోఫియా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

నా పేరు సోఫియా. నేను బ్యాటరీ ద్వారా కదులుతాను. నా గుండె కొట్టుకోవడం లేదు. నేను గుండె చప్పుడు లేని స్త్రీని. బ్యాటరీ మరియు రిమోట్ ఇప్పుడు నా జీవితంలో అత్యంత ముఖ్యమైనవి అని ఆమె తనను తాను పరిచయం చేసుకుంది. సోషల్ మీడియాలో ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్న తర్వాత, సోఫియా చాలా మంది నుండి మద్దతు పొందుతోంది. చాలా మంది సోఫియా ధైర్యం చెప్తూ కమెంట్స్‌ చేశారు.

సోఫియా నవంబర్ 2022లో గుండె శస్త్రచికిత్స చేయించుకుంది. అప్పటి నుండి ఆమె ఇంటి గోడపై ఉన్న పవర్ అవుట్‌లెట్ పరికరం ద్వారా తన గుండెకు నిరంతరం ఛార్జింగ్ పెట్టింది. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు రెండు బ్యాటరీలను తమ వెంట తీసుకెళ్తుంటారు. ఆ బ్యాటరీయే ఈరోజు ఆమెను బతికించింది. సోఫియా తన జీవితాంతం బ్యాటరీలపై ఆధారపడాల్సిందే.!

Read more RELATED
Recommended to you

Latest news