ఐపీఎల్‌ సిక్సర్ల వీరులు….తొలి రెండు స్థానాల్లో విదేశీయులే

-

ఐపీఎల్ వస్తుందంటే క్రికెట్ అభిమానులకు పండుగే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాట్స్‌మెన్ల బౌండరీలు, ఫీల్డర్ల విన్యాసాలు, బౌలర్ల మెరుపు బంతులతో దాదాపు రెండు నెలలు అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ఏప్రిల్ 9 (శుక్రవారం) రోజున ప్రారంభం కానుంది. అంటే మరో రెండు రోజుల్లో దేశంలో క్రికెట్ పండుగ మొదలు కాబోతుందని చెప్పొచ్చు. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అయితే పలువురు ఆటగాళ్ళకు, జట్టు సిబ్బందికి, అలానే స్టేడియంలో పని చేసే సిబ్బంది కూడా కరోనా బారిన పడిన విషయం తెల్సిందే.

ఐపీఎల్ తొలి సీజన్ ఇప్పటివరకు సిక్సర్ల సునామీ కురిసింది. అయితే ఈ టోర్నీలో ఇప్పటివరకు అత్యధికంగా సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ళు ఎవరో చూద్దాం. అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో అగ్రస్థానంలో విండీస్ వీరుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ ఐపీఎల్ లో ఇప్పటివరకు ఏకంగా 349 సిక్సర్లు బాదాడు. ప్రస్తుతం గేల్ పంజాబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గేల్ తర్వాత స్థానంలో సౌతాఫ్రికా ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) రెండో స్థానంలో ఉన్నాడు. డివిలియర్స్ ఇప్పటివరకు 235 సిక్సర్లు బాదాడు.

ఇక మూడో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొనసాగుతున్నాడు. ధోనీ..ఇప్పటి ఇప్పటివరకు 216 సిక్సర్లు బాదాడు. 213 సిక్సర్లతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ నాలులో స్థానంలో ఉన్నాడు. ఇక ఐదో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకు 201 సిక్సర్లు బాదాడు.

Read more RELATED
Recommended to you

Latest news