పలాస టీంని అభినందించిన బన్నీ..!

-

యువ కథానాయకుడు నటుడిగా..కరుణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పలాస ‘పలాస 1978’. యాథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ప‌లాస చిత్ర క‌థ ఓ ఎత్తైతే, ర‌ఘు కుంచె అందించిన సంగీతం మూవీని మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లింది. ఈ సినిమాలో ఎక్కువగా పాపులర్ అయిన పాట ఎంటంటే నాది నక్కిలీసు గొలుసు అనే పాట చిన్న చిత‌కా, ముస‌లి ముత‌కా ఇలా ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ర్షిస్తుంది.

అయితే ఈ చిత్రాన్ని వీక్షించిన అల్లు అర్జున్ చిత్ర బృందాన్ని ప్ర‌శంసించారు. ఈ సందర్భంగా ట్విట్టలర్ స్పందిస్తూ… పలాసా 1978 మూవీ బృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ చిత్రాన్ని చూసిన‌ మరుసటి రోజు ఉదయం దర్శకుడిని కలిశాను అన్నారు. గొప్ప అంతర్లీన సందేశంతో అద్భుతమైన ప్రయత్నం చేశారు డైరెక్టర్. వ్య‌క్తిగతంగా చిత్రం నాకు చాలా నచ్చిందన్నారు. ఈ సినిమాలో మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లోభాగంగా బన్ని పలాస దర్శకుడితో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news