వెంకటేష్ తాజాగా నటిస్తున్న సినిమా “సైంధవ్” ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. హిట్ 2 లాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను తెరకెక్కించి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ శైలేశు కొలను ఈ సినిమాను ఎంతో ప్రెస్టేజ్ గా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. మెడికల్ మాఫియాను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని చేస్తున్నారని ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి వచ్చిన ఒక అప్డేట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది. తమిళ హీరో ఆర్య రాజారాణి మరియు వరుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఇతను ఇందులో ఒక కీలక పాత్రను చేయనున్నారు. ఇందులో ఆర్య మానస్ అనే పాత్రలో మన అందరినీ అలరించనున్నారు. ఇతను లుక్ చూస్తుంటే వెంకటేష్ ను ఢీ కొట్టే పాత్ర అని తెలుస్తోంది. కాగా త్వరలోనే ఈ సినిమా నుండి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
ఇక బాలీవుడ్ లో ఫేమస్ నటుడిగా పేరున్న నవాజుద్దీన్ సిద్ధికి ఇందులో నటిస్తుండడం గమనార్హం. మరి వెంకటేష్ కు కనీసం ఈ సినిమా అయినా హిట్ ను అందిస్తునఃడా అన్నది చూడాలి.