మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వాటి ధరలు చూస్తే… సామాన్యుడి గుండె బరువెక్కుతోంది. మొన్నటి ఐదు రాష్ట్రాల ముందు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు పూర్తి కాగానే.. ధరలు డబుల్ చేసేస్తుంది.
అయితే, తాజాగా వాహనదారులకు మరో షాక్ తగిలింది. ఈ సారి చమురు ధరలు కాకుండా, వాహనాల ధరలు భారీగా పెరిగి పోయాయి. ఇవాళ వాహన ధరలు పెంచనున్నట్టు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ఒక్కో వాహనంపై రూ.1500 వరకు పెంచనున్నట్టు వెల్లడించింది హీరో మోటోకార్ప్. ఇక ఈ పెంచిన ధరలు ఇవాళ్టి నుంచే అమలు చేయబోతున్నారు.