హీరో నాని ‘హాయ్ నాన్న’ మూవీకి ఇంటర్నేషనల్ అవార్డ్

-

హాయ్‌ నాన్న.. ఇటీవల రిలీజై సైలెంట్‌ హిట్‌ కొట్టిన సినిమా. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన  ఈ సినిమాకు మొదట్లో యావరేజ్‌ టాక్‌ వచ్చింది. సినిమా చాలా క్లాస్‌గా ఉందని అనుకున్నారు. కానీ మెల్లమెల్లగా సినిమా జనాలకు ఎక్కింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చేసింది.నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా వచ్చిన హాయ్‌ నాన్న సినిమా డిసెంబర్‌ 7న విడుదలైంది. ఈ చిత్రంలో హీరో ,హీరోయిన్ కెమిస్ట్రీ కూడా క్యూట్‌గా ఉంది.శౌర్యువ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇదిలా ఉంటే…’హాయ్ నాన్న’ మూవీకి అంతర్జాతీయ పురస్కారం దక్కింది. ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు సొంతం చేసుకుంది. ఈ చిత్రం లో బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్‌ బేబీ, విరాజ్‌ అశ్విన్‌, శ్రుతిహాసన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.హషీమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం అందించాడు.వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజేందర్‌రెడ్డి తీగల నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news