వాళ్లది కమీషన్‌- మాది మిషన్‌’.. ఇండియా కూటమిపై మోదీ ఫైర్

-

ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభ ఎన్నికల ప్రచార జోరును పెంచారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహరాన్‌పుర్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలపై విరుచుకుపడ్డారు.  కమీషన్ల ఆర్జనే లక్ష్యంగా ఇండి కూటమి అధికారం చేపట్టాలని కోరుకుంటున్నట్లు మోదీ ఆరోపించారు.  బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీయే మాత్రం భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మిషన్‌ కోసం పనిచేస్తోందని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహరాన్‌పుర్‌, రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌ సభల తర్వాత ప్రధాని మోదీ దిల్లీ శివారులోని గాజియాబాద్‌లో భారీ రోడ్‌ షో నిర్వహించారు.

“ఈ లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లలో గెలవకుండా ఆపడానికి మాత్రమే విపక్షాలు పోరాటం చేస్తున్నాయి. అందుకోసం సమాజ్‌వాదీ పార్టీ గంటకో అభ్యర్థిని మారుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్నచోట ప్రధాన ప్రతిపక్షం కనీసం అభ్యర్థులను బరిలో దించలేకపోతోంది.  కాంగ్రెస్‌ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింలీగ్‌, వామపక్షాల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది” అని ప్రధాని మోదీ విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news