హీరో నాని సంచలన నిర్ణయం.. సినిమా పరిశ్రమకు దూరం !

హైదరాబాద్ : టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తదుపరి సినిమా థియేటర్ లో విడుదల కాకపోతే సినీ పరిశ్రమను వదిలేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో నాని. ఇవాళ టక్ జగదీశ్ సినిమా ట్రైలర్‌ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌ విడుదల చేసిన సందర్భంగా హీరో నాని.. తన సినిమా కెరీర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో నాని.

తన తదుపరి సినిమా థియేటర్ లో విడుదల కాకపోతే సినీ పరిశ్రమను వదిలేస్తానని తెలిపారు నాని. టక్ జగదీశ్ విడుదల విషయం లో తనను బయటి వాడిలా చూడటం బాధ కలిగించిందని హీరో నాని ఆవేదన వ్యక్తం చేశారు. “బయట పరిస్థితులు బాగున్నప్పుడు కూడా నా సినిమా థియేటర్ కు వెళ్లక పోతే ఎవరో తనను బ్యాన్ చేయడం కాదు… నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా ” అంటూ హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నాని చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో పెను ప్రకంపనలు రేపుతున్నాయి.