పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరో నవీన్ చంద్ర..!

-

సాధారణంగా మన అభిమాన సెలబ్రిటీల నుండి శుభవార్త ఎప్పుడైనా .. ఎలాగైనా రావచ్చు. సాధారణంగా హీరోలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొడితేనే సంతోషించే అభిమానులు.. అదే ఆ హీరోలు, హీరోయిన్లు పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తండ్రి లేదా తల్లి అయ్యారంటే ఇది కూడా చాలా సంతోషించాల్సిన విషయమే.. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర కూడా తండ్రి అయ్యారు. ఆయన భార్య బుధవారం ఫిబ్రవరి 22వ తేదీన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.. ఈ గుడ్ న్యూస్ నవీన్ చంద్ర సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

పుట్టినరోజు ప్రేమగా చేతిలోకి తీసుకొని మాకు బాబు పుట్టాడు అంటూ తన ఆనందాన్ని పోస్టు ద్వారా వెల్లడించారు. దీంతో ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా నవీన్ చంద్ర దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం నవీన్ తన బాబుతో దిగిన ఫోటోలను షేర్ చేసుకోగా అవి చాలా వైరల్ గా మారుతున్నాయి. అందులో అబ్బాయి కూడా చాలా క్యూట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నవీన్ చంద్ర అందాల రాక్షసి సినిమా ద్వారా నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకొని.. ఆ తర్వాత డిఫరెంట్ సినిమాలో.. క్యారెక్టర్స్ తో ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నాడు.

సాధారణంగా తన వ్యక్తిగత జీవితం గురించి బయటకు చెప్పుకోని నవీన్ చంద్ర గత ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా తన భార్య ఓర్మా ని పరిచయం చేసి తన జీవితంలో సగభాగం అంటూ తన భార్యపై ప్రేమను కురిపించాడు. ఈ ఏడాది వాలెంటైన్ మంత్ లోని గుడ్ న్యూస్ చెప్పడం విశేషం. ఇటీవల తన భార్యతో కలిసి బేబీ బంప్ ఫోటోషూట్ లో కూడా పాల్గొన్నారు. మొత్తానికి అయితే నవీన్ చంద్ర తండ్రి అవడంతో అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news