స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి తీపికబురు…!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది స్టేట్ బ్యాంక్. కొత్త సేవలు ని తీసుకు వచ్చింది స్టేట్ బ్యాంక్. దీని వల్ల మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీసులు ని స్టేట్ బ్యాంక్ తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… యూపీఐ అండ్ పే నౌ సర్వీసులను స్టేట్ బ్యాంక్ తీసుకు వచ్చింది.

భీమ్ ఎస్‌బీఐ పే యాప్ ద్వారా ఈ సేవలు పొండచ్చు. దీని వల్ల చాలా మందికి రిలీఫ్ కలగనుంది. క్రాస్ బార్డర్ యూపీఐ సేవలను తాజాగా కేంద్రం తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా విదేశాలకు సులభంగానే యూపీఐ ద్వారా డబ్బులు పంపొచ్చు, పొందవచ్చు కూడా.

ఎస్‌బీఐ కూడా ఈ సేవలను తన కస్టమర్లకు తీసుకు రావడం జరిగింది. భీమ్ ఎస్‌బీఐ పే యాప్ ద్వారా కస్టమర్లు విదేశాలకు యూపీఐ ద్వారా డబ్బులు సెండ్ చెయ్యచ్చు అలానే పొందొచ్చు కూడా. ఇన్‌వర్డ్ , ఔట్‌వర్డ్ రెమిటెన్స్ సర్వీసులు కూడా ఇప్పుడు పొందొచ్చు. సింగపూర్‌ ఇండియా దేశాల మధ్యనే ఇవి అందుబాటులో వున్నాయి.

భీమ్ ఎస్‌బీఐ పే యాప్ ద్వారా ఈ సర్వీసెస్ ని పొందచ్చని స్టేట్ బ్యాంక్ అంది. కస్టమర్స్ క్యూఆర్ కోడ్ లేదా బ్యాంక్ అకౌంట్‌ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా డబ్బులు పంపొచ్చు. ఇదిలా ఉంటే రుణ రేట్లు పెంచేసింది స్టేట్ బ్యాంక్. ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు కూడా పెంచింది.

 

Read more RELATED
Recommended to you

Latest news