హిట్టు కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్న నిఖిల్..!!

-

హీరో నిఖిల్ అదృష్టం మామూలుగా లేదు. వాస్తవానికి కార్తీకేయ 2 ఆ రేంజ్ హిట్ అవుతుందని ఎవ్వరూ అంచనా వేయలేదు. తన ఎప్పుడో పూర్తి అయినా కూడా రిలీజ్ కు అడ్డంకులు ఏర్పడ్డాయి. అప్పటికే బడ్జెట్ 30 కోట్లు దాటి రిస్క్ లో పడింది. కాని సినిమా రిలీజ్ అయ్యి 100 కోట్లకు పైగా వసూళ్ళు వర్షం కురిపించింది.

ఇక తన సినిమా కు ఇరవై కోట్లు పెట్టడమే ఎక్కువ అనుకునే సమయంలొ తనకి ఇలాంటి సూపర్ హిట్ వచ్చింది. దీనితో ఏ మాత్రం తొందర పడకుండా నిఖిల్ సిద్ధార్థ్ తెలివిగా ముందుకు వెళుతున్నాడు. తాను నటించిన 18 పేజెస్ విడుదల కు సిద్ధంగా ఉంది.చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

కొన్నిసార్లు తమ స్థాయికి మించిన విజయాలు హీరోలను ఇబ్బంది పెడుతుంటాయి. పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉందిప్పుడు. ఈ సినిమా హిట్ కోసం చాలా జాగర్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. కొన్ని సీన్లు కూడా రీషూట్ చేపించాడట. అలాగే అరవింద్ తో మాట్లాడి ప్రీ రిలీజ్ కోసం అల్లు అర్జున్ వచ్చేలా చేస్తున్నాడు.డిసెంబర్ 19న 18 పేజెస్ ప్రీ రిలీజ్ వేడుక జెర్సీ కన్వెన్షన్ హాల్‌లో జరగబోతుంది. దీనికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నారు. అల్లు అర్జున్ తో పాటు ఆయన ప్రియమైన డైరెక్టర్ సుకుమార్ కూడా వస్తున్నాడు. హిట్ కోసం నిఖిల్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news