తెలంగాణ అమ్మాయితో హీరో శర్వానంద్ పెళ్లి?

-

టాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు యంగ్ హీరో శర్వానంద్. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఆయన చిత్రాలుంటాయి. ప్రతీ ఒక్కరు శర్వానంద్ సినిమాను చూడొచ్చు అనే అభిప్రాయం ఆయన తన ఫిల్మ్స్ ద్వారా కలిగించారు. ఇక శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’సినిమాతో ఇటీవల మంచి హిట్‌ అందుకున్నాడు.

 

ఇది ఇలా ఉండగా, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడైన హీరో శర్వానంద్ (38) పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఓ ఎన్ఆర్ఐ మెడలో మూడు ముళ్ళు వేయనున్నట్లు సమాచారం. తెలంగాణలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆ అమ్మాయి యూఎస్ఏ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసి, హైదరాబాదుకు తిరిగివొచ్చినట్లు టాక్. ఇటీవల అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న శర్వానంద్ ను పెళ్లి ఎప్పుడు? అని బాలయ్య అడగ్గా, ప్రభాస్ తర్వాత అని బదులిచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news