ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై నేడు హైకోర్టు విచారణ

-

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసు’ను సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న తీర్పును కొట్టివేయాలని కోరింది. సింగిల్‌ జడ్జి పరిధి దాటి వ్యవహరించారని అప్పీల్‌లో ప్రభుత్వం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం సర్కారు అప్పీలుపై ఇవాళ విచారించనుంది.

ప్రతివాదిగా లేని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోవడం చెల్లదని ప్రభుత్వం తెలిపింది. ఈ కేసు ప్రాథమిక దశలో ఉందన్న విషయాన్ని సింగిల్‌ జడ్జి విస్మరించారని అప్పీల్‌లో పేర్కొంది. మొత్తం 74 అభ్యంతరాలను ప్రభుత్వం లేవనెత్తింది. సిట్‌ ఏర్పాటు చట్టబద్ధమేనని వాదించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదును ప్రశంసించిన సింగిల్‌ జడ్జి.. ఈ కేసును సీబీఐకి అప్పగించడం సరికాదని తెలిపింది. ఫిర్యాదుదారులతో నిందితులు మంతనాలు జరిపారని… బీజేపీలో చేరితే 100 కోట్లు, కేంద్ర ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు ఇస్తామని ఎర వేయడం తీవ్ర నేరమంటూనే సిట్‌ దర్యాప్తును నిలిపివేయడం చట్ట వ్యతిరేకంమని సర్కారు వాదించింది.

Read more RELATED
Recommended to you

Latest news