నా సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోతే ప్రెస్ మీట్ పెట్టను: హీరో సిద్దార్ధ్

-

తమిళ సినిమా రంగానికి చెందిన హీరో సిద్దార్ధ్, అయినప్పటికీ తెలుగు లో కొన్ని సినిమాల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక అభిమానులను తయారు చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇక తాజాగా ఒక సినిమాను ప్రమోట్ చేసుకునే విషయంలో ప్రెస్ మీట్ పెట్టిన సిద్దార్ధ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి హైలైట్ అవుతున్నాడు. పరిశ్రమలో కొందరి సినిమా డిస్ట్రిబ్యూటర్ లు నా సినిమాలు ఎవరూ చూడరని చులకన చేస్తూ కామెంట్ చేశారని అలాంటి వారందరికీ నేను ఒక్కటే చెబుతున్నా అంటూ హీరో సిద్దార్ధ్ మాట్లాడుతూ తన బాధను తెలియచేశాడు. నేను, అంజలి, నిమిష సజయన్ లు నటించిన తమిళ చిత్రం చిత్త… ఈ సినిమాను తెలుగు లో కూడా చిన్న అన్న పేరు మీద అక్టోబర్ 6వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా కనుక తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోతే ఇక మీదట నేను ప్రెస్ మీట్ లు ఇక్కడ పెట్టబోనని సిద్దార్ధ్ చెప్పారు.

అంటే ఈ మాటలను బాగా అర్ధం చేసుకుంటే సినిమాలో ఎంత సబ్జెక్టు లేకపోతే ఇలా మాట్లాడుతారంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి మరో మూడు రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news