విజయ్ పాలిటిక్స్ : మా మధ్య విభేదాలు లేవన్న విజయ్ తండ్రి

తమిళ హీరో విజయ్ రాజకీయ ప్రవేశం ప్రకటన ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతోంది. నిన్న తమిళ్ హీరో విజయ్ తన తండ్రి చెబుతున్నట్టు పార్టీకి తనకి ఎటువంటి ప్రత్యక్ష పరోక్ష సంబంధం లేదని అని పేర్కొన్నాడు. ఆ ప్రకటన మీద విజయ్ తండ్రి చంద్ర శేఖర్ ఈ రోజు స్పందించారు. తనకూ తన కొడుకుకు మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. మీడియా అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నారాయన.

అలానే అభిమాన సంఘం తరుపున జరిగే మంచి కార్యక్రమాలకు ఒక అంగీకారం అని ప్రయత్నించాను కానీ దాని వెనుక వేరే ఉద్దేశం ఏమీ లేదని అన్నారు. విజయ్ ప్రకటన గురించి ఏమయినా మాట్లాడాలి అంటే అది విజయ్ మాత్రమే మాట్లాడాలి గాని నేను కాదని అన్నారు. అయితే ఈ లేఖలో వ్యవహారం మీద విశ్లేషకులు వేరే విధంగా స్పందిస్తున్నారు. ఇది అభిమానులకు ఒక ఫీలర్ లాంటిది అని భావించవచ్చని అంటున్నారు. ఒక వేళ నిజంగానే ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఏమిటి అనే దాని మీద ఇలా తండ్రీ కొడుకులు ప్లాన్ చేసి ఉండచ్చని అంటున్నారు.