ముద్దులొలికే చిన్నారితో హీరోయిన్ రాశి.. ఫోటోలు వైరల్..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న రాశి.. ఆ తర్వాత సీనియర్ హీరోలకు.. మిడిల్ రేంజ్ హీరోలకు ఎక్కువగా హీరోయిన్ గా నటించి మెజారిటీ సినిమాలతో సక్సెస్ సొంతం చేసుకుంది. అయితే కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం.. కథల ఎంపిక విషయంలో పొరపాట్ల వల్ల ఆఫర్లు తగ్గాయి. ఆ తర్వాత వివాహం చేసుకొని ఒక పాపకు జన్మనిచ్చింది రాశి. ప్రస్తుతం తన కూతురితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటోలు కాస్త వైరల్ అవ్వడమే కాకుండా ఇందులో హీరోయిన్ రాశి కూతురు ఎంత అందంగా ఉంది అంటూ పలువురు నెటిజన్లు లవ్ ఎమోజీలతో తమ కామెంట్లను వ్యక్తపరిస్తున్నారు.

ఇదిలా ఉండగా తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, హిందీ భాషలలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇకపోతే రాశి ముద్దులొలికే కూతురు పేరు రిధిమ.. రాశి..” నా జీవితంలో ఏ టైంలో జరగాల్సిన ముచ్చట..ఆ టైంలోనే జరిగింది” అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈమె ఫ్యామిలీ అంతా చెన్నైలో ఉన్నప్పటికీ.. రిధిమాకు తెలుగు వచ్చని తెలిసిన నెటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు. నేను టీవీ చూడడానికి ఎక్కువగా ఇష్టపడనని కామెంట్లు చేశారు రాశి. ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు అనే సినిమా సమయంలో రాశి.. తన భర్త శ్రీనివాస్ కు పరిచయం ఏర్పడింది. ఈమె అసలు పేరు విజయలక్ష్మి అయితే అప్పటికే విజయలక్ష్మి పేరిట నటులు ఉండడంతో ఆమెకు పేరు మార్చారు.

అయితే ఆమె భర్తకు తానే మొదట లవ్ ప్రపోజ్ చేశానని.. ఇంట్లో వాళ్ళని కాదని వివాహాం చేసుకున్నప్పటికీ తాను ఇప్పుడు కుటుంబంతో కలిసి సంతోషంగా ఉన్నానని తెలిపింది రాశి. ప్రస్తుతం రాశి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news