విద్యుత్ ఉద్యోగులకు జగన్ బిగ్ షాక్. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యం షాక్ ఇచ్చింది. ప్రతి నెల మొదటి తేదీన ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలను నిలిపివేసింది. దీనికి నిధులు సర్దుబాటు కాకపోవడమే కారణమని సమాచారం.
దీంతో ఉద్యోగులకు నవంబర్ నెల జీతం గురువారం రాత్రి వరకు అందలేదు. జెన్ కో, ట్రాన్స్ కో, మూడు డిస్కం ల పరిధిలో పనిచేస్తున్న సుమారు 28 వేల మంది సిబ్బందికి మరోసారి నిరీక్షణ తప్పలేదు. గత ఫిబ్రవరిలో సుమారు రెండు వారాలపాటు జీతాల చెల్లింపులో యాజమాన్యం ఆలస్యం చేసింది. జన్ కో ఉద్యోగులు ఎండి కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన తర్వాత జీతాలను విడుదల చేసింది. అప్పటినుంచి ప్రతి నెల మొదటి తేదీనే చెల్లిస్తోంది. మళ్లీ 8 నెలల తర్వాత, ఒకటో తేదీన జీతాలు చెల్లించలేదు. పింఛన్ దారులు, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు.