హీరోయిన్లలో సాయి పల్లవి రేర్ పీస్.! నిర్మాత షాక్!

హీరోయిన్ సాయి పల్లవి ఇప్పుడున్న అందరి హీరోయిన్స్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంటుంది.ఆమె అందాలు చూపించే కన్నా కంటెంట్ వున్న సినిమాల్లో మాత్రమే నటిస్తూ ఉంది. హీరోయిన్స్ లో ఈ క్వాలిటీ చాలా అరుదుగా ఉంటుంది. ఇప్పుడున్న హీరోయిన్స్ క్రేజ్ ఉన్నప్పుడే మనీ సంపాదించుకుందాం అనే టైపులో ఉన్నారు. కాని సాయి పల్లవి మనీ కు కాకుండా కంటెంట్ కు ప్రాధాన్యం ఇస్తోంది.

ప్రస్తుతం ఒక్కొక్క సినిమా కు రెండు నుండి ఐదు కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వడానికి ప్రొడ్యూసర్స్ సిద్ధం గా ఉన్నా సాయి పల్లవి మాత్రం కమిట్ అయ్యేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి హీరోయిన్స్ కూడా ఉంటారా అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక చాలా మంది నిర్మాతలు ఆమె దగ్గరకి వెళ్ళే సాహసం కూడా చేయటం లేదట.

సాయి పల్లవి వరసగా సినిమాలు చేయకపోవడం చూసి ఆమెను నిర్మాతలు  ఏ ఒక్కరు అర్థం చేసుకోలేక పోతున్నారు. ఒక సీనియర్ నిర్మాత మీడియా తో మాట్లాడుతూ తన పాతిక సంవత్సరాల సినీ కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్స్ ని చూశాను. చాలా డబ్బు ఇస్తా అన్నా కూడా సినిమా ఒప్పుకోలేదు.నేను ఇలాంటి హీరోయిన్ ని చూడ లేదు. సాయి పల్లవి ని అర్థం చేసుకోవడం మా వల్ల కావడం లేదంటూ ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఫేమ్ ఉన్నప్పుడే చాలా మంది సినిమాలు చేసుకుంటూ వెళతారు కాని సాయి పల్లవి మాత్రం రేర్ పీస్ అని చెబుతున్నారు.