పాపం.. తాప్సీ అన్ని సార్లు చెంపదెబ్బ కొట్టించుకోవాల్సి వచ్చిందా..?

-

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝమ్మంది నాదం’ మూవీతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది తాప్సీ. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ ఓ వైపు పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ లోను తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ముద్దుగుమ్మ తాప్సీ. ప్రస్తుతం తాప్సి ‘థప్పడ్’అనే సినిమాలో నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో బిజిగా ఉంది. అయితే ఈ సినిమాలో భర్త చెంపదెబ్బ కొట్టడంతో అతన్ని వదిలేసే భార్య పాత్రలో తాప్సీ నటిస్తోంది. ఈ చిత్రంలో చెంపదెబ్బ సీన్ కోసం తాను పడిన కష్టాన్ని ఆమె వివరించారు.

తన భర్త పాత్రలో నటించిన పవైల్ గులాటి ఈ సీన్ కోసం చాలా భయపడ్డాడని, మానసికంగా అతను సిద్ధపడటానికి రెండ్రోజులు పట్టిందని తాప్సీ వెల్లడించింది. అంత చేసినా సీన్ వద్దకొచ్చే సరికి పవైల్ టెన్షన్ పడ్డాడని తెలిపింది. ఒక్కోసారి తన మెడపై, మరోసారి చెవులపై దెబ్బలు తగిలేవని, దీంతో మరో టేక్ తీసుకోవాల్సి వచ్చేదని వివరించింది. అయితే సినిమాలో ఈ సీన్ చాలా ముఖ్యమైంది కావడంతో దాదాపు ఏడుసార్లు తాను చెంపదెబ్బ కొట్టించుకోవాల్సి వచ్చిందని చెప్పింది. మ‌రి ఇంత కష్టపడిన ఈ సీన్‌ను తాప్సీ ఎలా చేసిందో 28న విడుదలయ్యే ‘థప్పడ్’లో వెండితెరపై చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news