తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇటీవల హైకోర్టు వరుసగా బ్రేకులు వేస్తూ వస్తోంది. తెలంగాణలో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ నిర్ణయాలను హైకోర్టు ఇప్పటికే చాలాసార్లు మొట్టి కాయలు వేసింది. తాజాగా మరోసారి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టింది. సోమవారం వరకూ రూట్ల ప్రయివేటీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తొలుత మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను తమకు పంపాలని హైకోర్టు కోరింది. ప్రభుత్వం తీసుకున్న రూట్ల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సోమవారం వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.