ఈటల రాజేందర్ కు ఎదురు దెబ్బ : భూముల కబ్జాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

-

హైకోర్టులో ఈటల రాజేందర్ కు షాక్ ఇచ్చింది. దేవరాయాంజల్ భూములపై వేసిన ఐఏఎస్ ల కమిటీని రద్దు చేయాలని దాఖలు అయిన పిటిషన్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఐఏఎస్ ల కమిటీ ఏర్పాటు జీవో కొట్టి వేయాలని కోరుతూ సదా కేశవరెడ్డి పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. అయితే జీవో 1014 అమలు నిలిపివేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయ భూములు గుర్తించేందుకు విచారణ చేస్తే ఇబ్బందేంటని ప్రశ్నించింది హైకోర్టు. ప్రభుత్వ, ఆలయ భూములను గుర్తించకూడదా? కబ్జాదారులను ఆక్రమణలు చేసుకోనీయాలా? అని సీరియస్ అయింది హైకోర్టు. విచారణ జరిపి నివేదిక ఇవ్వడం కమిటీ బాధ్యత అని తెలిపింది.

అయితే నోటీసులు ఇవ్వకుండా భూముల్లోకి వస్తున్నారని పిటిషనర్ వాదించగా.. దేవరాయాంజల్ భూములపై విచారణ చేసే స్వేచ్చ కమిటీకి ఉందని స్పష్టం చేసింది హైకోర్టు. భూముల్లోకి వెళ్లే ముందు పిటిషనర్లకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశారు జారీ చేసింది. పిటిషనర్లపై వ్యతిరేక చర్యలు తీసుకుంటే, ముందస్తు నోటీసు ఇవ్వాలని.. కమిటీకి అవసరమైన దస్త్రాలు, సమాచారం ఇవ్వాలని పిటిషనర్లకు హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు విచారణకు సహకరించకపోతే అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని.. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news