సీఎం కి నోటీసులు జారీ చేసిన హైకోర్టు…

-

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌పై హత్యాయత్నం జరిగిన ఘటనపై ఈ రోజు హైకోర్టు విచారణ చేపట్టింది. తనకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం చెందడంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను ఏపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని పిటిషన్ లో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేస్తున్న దర్యాప్తు పై తనకు నమ్మకం లేదంటూ… కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఈ హత్యాయత్నంపై విచారణ జరిపించాలని కోరారు. వీటన్నింటిపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ సహా 8 మందికి నోటీసులు జారీచేసింది.

రెండు వారాల్లోగా ఈ విషయమై తమ ప్రతిస్పందనను తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులు జరిపిన విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో సమర్పించాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news