రాహుల్ గాంధీనే పెళ్లి చేసుకుంటా..

-

Love pulls her to politics; wants to marry Rahul Gandhi

చదివారుగా టైటిల్. నవ్వొస్తున్నదా? అరె.. పడిపడి అలా నవ్వుతారెందుకు. రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటా అని అన్న అమ్మాయిని చూసి నవ్వుతున్నారా? దేనికి నవ్వుతున్నారో చెప్పండి. అసలు విషయం తెలుసుకోకుండానే నవ్వితే ఎలా. మొత్తం చదివాక మీ ఇష్టమున్నంత సేపు నవ్వుకోండి.

ఛత్తీస్ గఢ్ కు చెందిన ఓ యువతి కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఎందుకు నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరావమ్మా అని కాంగ్రెస్ నేతలు అడిగితే.. రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవాలని ఉంది. అందుకే.. కాంగ్రెస్ పార్టీలో చేరా.. అని బాంబు పేల్చింది. దీంతో వాళ్లు నోరెళ్లబెట్టడం తప్ప ఇంకేం చేయలేకపోయారు.

ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ లో ఎన్నికల సీజన్ కదా. రాహుల్ ఛత్తీస్ గఢ్ లో ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నాడు. ఈనేపథ్యంలోనే రాహుల్ గాంధీపై మనసు పారేసుకున్నది ఈ యువతి. తనకు ఇష్టమైతే రాహుల్ ను పెళ్లి చేసుకుంటానంటూ బాహటంగా చెప్పింది. ఇదివరకు కూడా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువతి రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానంటూ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ యవతిని రాహుల్ ఎలాగూ చేసుకోలేదు.. కనీసం ఈ యువతినైనా చేసుకుంటాడో లేదో కాలమే సమాధానం చెప్పాలి. ఇక నవ్వుకోండి…

Read more RELATED
Recommended to you

Latest news