షాక్: స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రెటరీకి హై కోర్ట్ ధిక్కరణ నోటీసులు…

-

ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీని గతంలో హై కోర్ట్ ఎయిడెడ్ స్కూల్స్ లో టీచర్లను నియమించాలని చెప్పిన విషయం తెలిసిందే. కానీ కారణాలు ఏమైనా హై కోర్ట్ చెప్పిన విధంగా చేయకపోవడంలో విఫలం అయింది. ఈ విషయంపై ఎయిడెడ్ స్కూల్స్ యాజమాన్యాలు కోర్ట్ లో కోర్ట్ ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ ను సీరియస్ గా తీసుకున్న హై కోర్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రెటరీపై ఆగ్రహంతో నోటీసులు జారీ చేసింది, ఇంతకు ముందే చెప్పినా పెడచెవిన పెట్టడంతో మరింత ఆగ్రహానికి గురయింది. కాగా ఈ కేసులో బాధ్యులుగా 2013 నుండి విద్యాశాఖలో ఉన్న వారిని చేర్చింది. ఈ కేసులో తదుపరి విచారణనను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ తీర్పును ఇచ్చింది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టం లో ఉన్న అధికారులు హై కోర్ట్ కు హాజరయ్యి ఏమైనా సమాధానం ఇవ్వాల్సి ఉంది. మరి దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news